![]() |
![]() |
.webp)
ఇన్ని నెలలుగా అలరించిన ఢీ ప్రీమియర్ లీగ్ గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇక ఈ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ఫినాలేకి "హాయ్ నాన్న" మూవీ హీరో నాని, మృణాల్ ఠాకూర్ ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఎప్పటిలాగే జడ్జెస్ శేఖర్ మాస్టర్, పూర్ణతో పాటు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్స్ చిన్ని ప్రకాష్, రేఖ ప్రకాష్ , బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మహేష్ విట్టా, విజె సన్నీ వచ్చారు.
తర్వాత నానిని ప్రదీప్ ఒక ప్రశ్న వేసాడు..ఐతే నాని మాత్రం దానికి ఆన్సర్ చెప్పకుండా ప్రదీప్ పెళ్లి గురించి న్యూస్ ని లీక్ చేసాడు. " ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళు అలిగితే వాళ్ళను బుజ్జగించడానికి మీరేం చేస్తారు" అని అడిగేసరికి "జెన్యూన్ గానే అడుగుతున్నావా...నెక్స్ట్ ఇయర్ నీ పెళ్ళని రూమర్స్ వచ్చాయి..ఎప్పటినుంచో ఈ రూమర్స్ వింటున్నా కూడా ప్రెజంట్ రూమర్ మాత్రం చాల పకడ్బందీగా, స్ట్రాంగ్ సోర్స్ నుంచి వచ్చింది" అని నాని అనేసరికి "ఎవరు చెప్పినా పర్లేదయ్యా, మీరు చెప్తే జనాలు నిజంగా నమ్మేస్తారు" అంటూ నానికి ఒక దణ్ణం పెట్టి నిజం చెప్పొద్దంటూ దణ్ణం పెట్టాడు.
"ఎప్పుడైనా లవ్ లెటర్స్ రాసివ్వడం కానీ, డైరెక్ట్ గా లైవ్ లో వచ్చి లవ్ లెటర్ ఇవ్వడం కానీ జరిగిందా" అని మృణాల్ ఠాకూర్ ని అడిగాడు ప్రదీప్..."లవ్ లెటర్స్ వచ్చాయి" అని ఆన్సర్ ఇచ్చింది మృణాల్. ఇక తర్వాత నాని తాను నటించిన దసరా మూవీ హిట్ సాంగ్ ని కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ తో కలిసి వేసాడు. ఇక ఈ గ్రాండ్ ఫినాలేలో గ్రీష్మ మాస్టర్, ప్రభుదేవా మాస్టర్ పోటీ పడ్డారు. ఐతే నెటిజన్స్ మాత్రం ప్రభుదేవా మాష్టర్ టైటిల్ విన్ అవుతారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
![]() |
![]() |